Breaking News

చెంప పగలగొట్టాడు.. సారీ కూడా చెప్పలేదు!

Published on Mon, 11/17/2025 - 13:43

నన్ను చాలామంది కొట్టారు. కానీ, ఇంత గట్టిగా, కోపంగా కొట్టింది మాత్రం గుల్షన్‌ గ్రోవర్‌ (Gulshan Grover) ఒక్కడే అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు సానంద్‌ వర్మ (Saanand Verma). 'ఫస్ట్‌ కాపీ' వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. ఓ సీన్‌ చిత్రీకరణలో భాగంగా గుల్షన్‌.. సానంద్‌ చెంప చెళ్లుమనిపించాలి. అయితే అతడు కొడుతున్నట్లుగా యాక్టింగ్‌ చేయకుండా నిజంగానే కొట్టానంటున్నాడు సానంద్‌.

నిజంగా చేయి చేసుకున్నాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సానంద్‌ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్‌ కాపీ వెబ్‌ సిరీస్‌లో గుల్షన్‌ నన్ను కొట్టే సీన్‌ ఉంటుంది. అతడు నన్ను సీరియస్‌గానే కొట్టాడు. ఆ క్షణం నాకు అతడి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, నన్ను నేను తమాయించుకుని సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పటివరకు ఒక్కమాట కూడా అనలేదు. ఫస్ట్‌ టైం ఈ విషయాన్ని బయటపెడుతున్నాను.

ముందు చెప్పాలిగా!
నిజంగా కొట్టేముందు కనీసం ఓ మాటయినా నాకు చెప్పాలిగా! అప్పుడు నేను సిద్ధంగా ఉండేవాడిని. ఇంత ఫీలయ్యేవాడిని కాదు. అప్పటికీ ఆ సీన్‌ షూటింగ్‌ అయ్యాక నేను లోలోపలే బాధపడ్డాను తప్ప ఎవరితోనూ ఏమీ అనలేదు. దగ్గర్లో ఉన్న కుర్చీ అందుకుని కొట్టాలనిపించినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. ఒక నటుడిగా దెబ్బలు తినడం నాకు కొత్తేమీ కాదు. 

నిజమైన దెబ్బలు కావు
ఎక్కువశాతం నాకు అలాంటి సీన్లే పడుతుంటాయి. 'బాబీ జీ ఘర్‌ పర్‌ హే' సీరియల్‌లో నేను చాలా చెంపదెబ్బలు తిన్నాను. కానీ, వాటికి ఓ పద్ధతి ఉంటుంది. అవేవీ నిజమైన దెబ్బలు కావు. మర్దానీ సినిమాలో కూడా నన్ను కొట్టే సీన్‌ ఉంటుంది. ఆ సన్నివేశం సరిగా రాకపోవడంతో నటుడు దిగ్విజయ్‌. నన్ను రియల్‌గా కొడతానని అడిగారు. 

క్షమాపణలు కూడా చెప్పలేదు
నేను అంగీకారం తెలిపాకే నాపై చేయి చేసుకున్నాడు. ఇది ఒక పద్ధతి. నటుడు అనిల్‌ కపూర్‌ కూడా నిజంగానే కొడతారని విన్నాను. కానీ, ఆయన కొట్టిన వెంటనే క్షమాపణలు అడుగుతాడు. గుల్షన్‌ కనీసం ఆ పని కూడా చేయలేదు. తన లోకంలో తనే ఉంటాడు అని సానంద్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్‌.. నామినేషన్స్‌లో ఎవరంటే?

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)