29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
Breaking News
ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: కియోసాకి హెచ్చరిక
Published on Sun, 11/16/2025 - 13:41
ఎప్పుడూ స్టాక్ మార్కెట్లను, బాండ్లను విమర్శించే ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా మరో ఆసిక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రమాద దశలో ఉందని హెచ్చరించారు.
ఆయన మాటల్లో.. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన “ప్రతీ బుడగ” ఇప్పుడు పేలుతున్నదనీ, దీనితో పెద్ద ఎత్తున ధరలు పడిపోతున్నాయనీ తెలిపారు. అయితే, ఈ పరిణామాల మధ్య ఆయన తన ఆస్తులను (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం) అమ్మడం లేదని స్పష్టం చేశారు.
‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన వరుస పోస్ట్‌లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని వ్యాఖ్యానించిన కియోసాకి (Robert Kiyosaki).. ప్రభుత్వాలు భారీ అప్పుల భారంతో కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చివరకు అధిక స్థాయిలో డబ్బు ముద్రించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు.
అదే సమయంలో, అధిక ముద్రణ వల్ల డాలర్ విలువ పడిపోవడంతో “నకిలీ డబ్బు” (fiat currency) క్రాష్ అవుతుందని, దాంతో సహజంగా విలువ కలిగిన కఠిన ఆస్తులు (Hard Assets) ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
క్రిప్టో మార్కెట్‌లో భారీగా పడిపోయే ధోరణి గురించి ఆయన మాట్లాడుతూ.. “బిట్‌కాయిన్ క్రాష్ అవుతోంది, ప్రతీ బుడగలు పగులుతున్నాయి. నేను అమ్ముతున్నానా? లేదు. ఎందుకంటే ప్రపంచానికి డబ్బు అవసరం, నాకు కాదు” అని అన్నారు.
కియోసాకి ప్రకారం.. భారీ అప్పు సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు త్వరలో “ది బిగ్ ప్రింట్” (నోట్ల ముద్రణ) ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులు మరింత విలువను సంపాదిస్తాయని ఆయన నమ్మకం.
BITCOiN CRASHING:
The everything bubbles are bursting….
Q: Am I selling?
A: NO: I am waiting.
Q: Why aren’t you selling?
A: The cause of all markets crashing is the world is in need of cash.
A: I do not need cash.
A: The real reason I am not selling is because the…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025
Tags : 1