Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
'కోర్టు' నటి శ్రీదేవికి తమిళ్ మరో ఛాన్స్
Published on Sun, 11/16/2025 - 07:00
టాలీవుడ్‌లో'కోర్ట్' సినిమాతో నటి శ్రీదేవి పాపులర్ అయిపోయింది. అదే ఊపులో తమిళంలో ఒకటి, తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కుంది. తమిళంలో కేజేఆర్ అనే నటుడు, నిర్మాత తీయబోతున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని కథానాయికగా ఇప్పటికే ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ప్రభుదేవా సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు మన శ్రీదేవి తమిళ్‌లో రెండో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

కోలీవుడ్‌లో వైవిధ్య భరిత కథాచిత్రాలను నిర్మిస్తున్న సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ అధినేతలు డాక్టర్ అరుళానందు, మ్యాథ్యు అరుళానందు ప్రతిభావంతులైన నటీనటులను, సాంకేతిక వర్గాన్ని ప్రోత్సహించే విధంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు శ్రీదేవికి వారు సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఇదే బ్యానర్ నుంచి నిర్మించిన జో చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నటుడు 'ఏగన్'(Aegan)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ శీను రామస్వామి దర్శకత్వంలో కోళి పన్నై చెల్లదురై అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించి సక్సెస్ తో పాటు ప్రశంసలను అందుకున్నారు.
తాజాగా తమ మూడో చిత్రాన్ని నిర్మించడానికి వారు సిద్ధమయ్యారు. ఇందులో జో, కోళిపన్నై చెల్లదురై చిత్రాలతో పాపులర్ అయిన నటుడు ఏకన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా ఇందులో కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, మలయాళ చిత్రం బ్రూస్ లీ బిజీ ఫెమ్ ఫెమినా జార్జ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆహా కళ్యాణం చిత్రం ఫేమ్ యువరాజ్ చిన్నస్వామి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
Tags : 1