'ఐ-బొమ్మ' నిర్వాహకుడు అరెస్ట్‌

Published on Sat, 11/15/2025 - 10:19

సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ  (i-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ను రవి నిర్వహిస్తున్నట్లు వారు గుర్తించారు. ఫ్రాన్స్‌ నుంచి తాజాగా అతను హైదరాబాద్‌ వచ్చినట్లు పోలీసులు సమాచారం రావడంతో పక్కా  ప్లాన్‌తో  కూకట్‌పల్లిలో రవిని అదుపులో తీసుకున్నారు. సినీ పరిశ్రమకు సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్‌లో ఉన్న రూ. 3 కోట్లు ఫ్రీజ్‌ చేసినట్లు తెలిపారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీని ఐబొమ్మలో  రిలీజ్‌ చేయడంతో సినీ పరిశ్రమ భారీగా నష్టపోతుందని నిర్మాతలు వాపోయిన విషయం తెలిసిందే.

సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తున్న ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం  థియేటర్‌లో సినిమాను రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న కొందరిని అరెస్టు చేశారు. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా ఐబొమ్మ వెబ్‌సైట్‌పై కూడా దృష్టి పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

 

Videos

బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

ఆసుపత్రిలో హై టెన్షన్.. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్.. 17 మంది పిల్లలకు సీరియస్

TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..

జమ్మూ కాశ్మీర్ బ్లాస్ట్.. పేలుడు ధాటికి 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ బాడీలు

2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..

బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల

నితీష్ కు షాక్.. బీహార్ లో బీజేపీ సీఎం

ఫోన్ పట్టుకుని తెగ షూట్ చేస్తున్నాడు.. పవన్ పై తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్లు

Photos

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)

+5

అక్షర్‌ పటేల్‌ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)