బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!
Breaking News
వాస్తవ ఘటనలతో...
Published on Sat, 11/15/2025 - 04:12
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్‌కి శ్రీకాంత్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘2013లో రామకృష్ణా రెడ్డిగారు నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా? అనేవాడిని. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారారు.
ఆయన దర్శకత్వంలో వాస్తవ ఘటనలతో రూపొందిన ‘దేవగుడి’ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’తో హిట్ కొట్టబోతున్నాం. స్క్రీన్ ప్లే ఆశ్చర్యపరుస్తుంది. రఘు కుంచెగారు చక్కనిపాత్ర చేశారు’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అని అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, కెమెరామేన్ లక్ష్మీకాంత్ కనికే మాట్లాడారు.
Tags : 1