బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!
Breaking News
మాస్టర్ సంకల్ప్ సందేశం
Published on Sat, 11/15/2025 - 04:05
‘‘ఈ రోజుల్లో పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కుటుంబ వాతావరణం, పరీక్షలు, మొబైల్ వాడకం, పెరిగిన సామాజిక నేపథ్యం ఇవన్నీ పిల్లలు ఒత్తిడికి గురి కావడానికి కారణాలుగా మారుతున్నాయి. పిల్లల్లో మానసిక రుగ్మతలు తొలగించేందుకు యోగ, ధ్యానం చక్కటి పరిష్కార మార్గాలను మన పూర్వీకులు సూచించారు. పిల్లలు యోగ, ధ్యానం చేసేలా పేరెంట్స్‌ప్రోత్సహించాలి’’ అన్నారు భీమగాని సుధాకర్ గౌడ్.
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్‌పై ‘ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి బాలల చిత్రాలను రూపొందించారు భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా బాలల చిత్రం ‘మాస్టర్ సంకల్ప్’. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘ట్రైలర్ చాలా బాగుంది’’ అని అన్నారు.
Tags : 1