మంచంపైనే నిద్రపోతున్నావా లేదా ఫ్రిజ్‌లో.. హీరోయిన్‌పై కామెంట్స్

Published on Mon, 11/10/2025 - 17:22

సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే విజయ్ సేతుపతి, ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇక్కడ సేతుపతి.. ఆమె గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. ఏదైతేనేం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. కామెడీగా గ్లింప్స్)

తమిళంలో తొలుత హీరోయిన్‌గా సినిమాలు చేసిన ఆండ్రియా.. తెలుగులోనూ 'తడాఖా'తో పాటు వెంకటేశ్ 'సైంధవ్'లో నటించింది. అంతకంటే ముందు సింగర్‌గా అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ తదితర సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె లేటెస్ట్ తమిళ మూవీ 'మాస్క్'. కవిన్ హీరోగా నటిస్తుండగా ఈమె విలన్‌గా చేసింది. రెండురోజుల క్రితం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి అతిథిగా వచ్చిన విజయ్ సేతుపతి, ఆండ్రియా గ్లామర్ గురించి ఫన్నీ కామెంట్ చేశాడు.

'నా చిన్నతంలో బీచ్‪ ఒడ్డున ఓ విగ్రహాన్ని చూశాను. అలానే నిన్ను కూడా చూశాను. అప్పటినుంచి మీ ఇద్దరూ అలానే ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం నువ్వు నటించిన యాడ్‌లో ఉన్నట్లే ఇప్పుడు అలానే ఉన్నావ్. నేనే కాదు నా కొడుకు కూడా నిన్ను ఆశ్చర్యంగానే చూస్తాడు. ఇంతకీ నువ్వు మంచంపైనే నిద్రపోతున్నావా లేదంటే ఫ్రిజ్‌లో పడుకుంటున్నావో అర్థం కావట్లేదు' అని విజయ్ సేతుపతి తనదైన స్టైల్లో మాట్లాడాడు. సేతుపతి మాట్లాడుతున్నంతసేపు ఎదురుగా కూర్చున్న ఆండ్రియా పడిపడి నవ్వుతూ కనిపించింది. దిగువ వీడియోలో మీరు ఇదంతా చూడొచ్చు.

(ఇదీ చదవండి: బాడీ షేమింగ్ ప్రశ్న.. సారీ చెప్పినా వదలని తమిళ హీరోయిన్)

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)