‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌’: ఇంటి హింస ఇంతింతై..

Published on Sun, 11/09/2025 - 11:06

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్‌కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్‌తో వచ్చే పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్‌నర్‌ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...

పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్‌ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.

సిండ్రోమ్‌ తాలూకు నాలుగు దశలివి... 
బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్‌ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 

1. డీనియల్‌ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్‌’. 

2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 

3. ఎన్‌లైట్‌మెంట్‌ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్‌లైట్‌మెంట్‌ దశలో జరుగుతుంది. 

4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. 

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ మొదలయ్యేదిలా... 
మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్‌గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. 

కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్‌ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్‌ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.
నిర్వహణ: యాసీన్‌

ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... 

జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్‌) 
ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్‌ ఎస్టీమ్‌) 
తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్‌ యాంగ్జైటీ).

దీర్ఘకాలిక ప్రభావాలివి... 
తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్‌ స్టేట్‌), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్‌ ఔట్‌బరస్ట్‌... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం)  హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌  దీర్ఘకాలికం (క్రానిక్‌)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌కు ఇవే గుర్తులు... 
హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్‌కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన.  

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)