Breaking News

12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ

Published on Thu, 11/06/2025 - 10:54

ఒకప్పుడు హీరోయిన్‌గా వెండితెరను ఏలిన ఎంతోమంది తారలు ఇప్పుడు స్క్రీన్‌పై తల్లి, అత్త, వదిన పాత్రలు పోషిస్తూ సెకండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నారు. వెండితెరకు దూరంగా ఉండటానికి బదులుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రోజా (Roja Selvamani) కూడా.. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు రెడీ అయ్యారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

డీగ్లామర్‌ లుక్‌లో రోజా
డీడీ బాలచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న లెనిన్‌ పాండ్యన్‌ సినిమాలో రోజా నటిస్తున్నారు. 'చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ.. సంతోషంగా ఉంది డియర్‌' అంటూ నటి ఖుష్బూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో రోజా నటించిన సినిమాలు, పాటల క్లిప్పింగ్స్‌ను జత చేశారు. చివర్లో రోజా డీగ్లామర్‌ పాత్రలో వయసైపోయిన పెద్దావిడగా కనిపించారు. ఆమె పాత్ర పేరు సంతానం అని రివీల్‌ చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే.. మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శివాజీ గణేశన్‌ మనవడు దర్శన్‌ గణేశన్‌ నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిలింస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది.

రోజా హీరోయిన్‌గా..
హీరోయిన్‌ అవాలని రోజా ఎన్నడూ అనుకోలేదు. ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్‌ సెలక్షన్స్‌ కోసం డైరెక్టర్‌ శివప్రసాద్‌ తన కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆల్బమ్‌లో రోజా ఫోటో చూసి ఆరా తీస్తే.. నాగరాజారెడ్డి కూతురని తెలిసింది. వీళ్లిద్దరూ అప్పటికే మంచి ఫ్రెండ్స్‌. దీంతో ఆయన అడగ్గానే రోజా తండ్రి కాదనలేకపోయారు. ఒక సినిమాయే కదా, చేయమన్నారు. అలా ప్రేమతపస్సుతో రోజా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ
ఫస్ట్‌ సినిమాకే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. రాజకీయాల్లో వచ్చాక సినిమాలకు గుడ్‌బై చెప్పారు. తెలుగులో చివరగా 2013లో, తమిళంలో అయితే 2015లో చివరగా రోజా సినిమాలు వచ్చాయి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. మరి తెలుగులోనూ సినిమాలు చేస్తారా? అనేది చూడాలి!

 

 

చదవండి: పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్‌!

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)