76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారు

Published on Mon, 10/27/2025 - 15:05

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ (Ferrari).. ఎఫ్76 (F76) పేరుతో ఓ కొత్త డిజిటల్ హైపర్‌కార్ కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇతర ఫెరారీ కార్ల కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది ప్రస్తుతానికి సాధారణ కారు కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వర్చువల్ / డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది.

ఫెరారీ ఎఫ్76 కారును కంపెనీ 2025 అక్టోబర్ 25న ఇటలీలోని ముగేల్లో సర్క్యూట్ వద్ద 'ఫెరారీ ఫినాలి మొండియాలి' ఈవెంట్‌లో దీన్ని ఆవిష్కరించారు. ఎఫ్76 అనేది.. 1949లో ఫెరారీ మొదటిసారి లే మ్యాన్స్ 24 హవర్స్ రేస్ గెలిచినా సందర్భంగా.. ఆ విజయానికి 76 పూర్తయ్యాయని సూచిస్తుంది.

కంపెనీ దీనిని కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఆవిష్కరించింది. ఇది చూడటానికి ఆన్‌లైన్‌లో ఏ వీడియో గేమ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే ఓ కారు మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని ప్రస్తుతం కొనుగోలు చేయలేరు. అంతే కాకుండా దీనిని డిజైన్ ఫ్రీడమ్ కోసం రూపొందించిన కాన్సెప్ట్. కాబట్టి దీనికి భద్రతా ప్రమాణాలు, హోమోలొగేషన్ వంటి పరిమితులు లేవు. బహుశా భవిష్యత్తులో ఈ కారును కంపెనీ లాంచ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?

ఫెరారీ ఎఫ్76 కారు డిజైన్ చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ముందు బ్రాండ్ లోగో.. దానికింద ఎక్కువ స్పేస్ ఉంది. ఇందులో లైటింగ్ సెటప్ లేకపోవడం గమనార్హం. సైడ్ ప్రొఫైల్, అల్లాయ్ వీల్స్ మొత్తం కూడా కొత్తగా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ గమనిస్తే.. ఇండికేటర్ వంటిది చూడవచ్చు. బటర్‌ఫ్లై డోర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ సాధారణ ఫెరారీ మాదిరిగా లేదు.

Videos

రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు