Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్ మర్డర్
Breaking News
భావోద్వేగాల ప్రేమకథ
Published on Fri, 09/19/2025 - 02:09
‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘బ్యాండ్ మేళం’. ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్ ’ అనేది ఉప శీర్షిక. సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సతీష్ జవ్వాజీ రచన, దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్)ని రిలీజ్ చేశారు మేకర్స్.
‘‘అందమైన గ్రామీణ ప్రేమకథగా రూ పొందుతోన్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు సతీష్ జవ్వాజి. యాదగిరి (హర్ష రోషన్ ), రాజమ్మ (శ్రీదేవి అపల్ల) ప్రేమకథని అందంగా తెరపై చూపించనున్నారాయన’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: శివరాజు ప్రణవ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: సతీష్ ముత్యాల.
Tags : 1