Breaking News

ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!

Published on Thu, 09/18/2025 - 13:27

భారతదేశంలో ఈ20 పెట్రోల్ వినియోగించాలని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. కొందరు నిపుణులు ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అయితే చండీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ20 ఫ్యూయెల్ పెట్రోల్ హై-ఎండ్ వాహనాలపై చూపే ప్రభావాన్ని ఎత్తి చూపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక స్నేహితుడి ఫెరారీ కారుకు ఈ20 పెట్రోల్ ఉపయోగించాడు. అయితే ఆ కారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వలేదు. కొందరు నిపుణులు ఈ20 ఇంధనం వల్లనే.. ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీనికి గడ్కరీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.

నిజం ఏమిటంటే.. సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇథనాల్ గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఫ్యూయెల్ ట్యాంక్‌లో తేమశాతం పెరుగుతుంది. ఫలితంగా కారు స్టార్ట్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని ఆ వ్యక్తి ఎక్స్ ఖాతాలో వివరించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఫెరారీ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఈ20 ఫ్యూయెల్ కారణమా? లేక ఇంకేమైనా సమస్యా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే E20 ఇంధనం వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఇథనాల్ కారణంగానే ఇలాంటి సమస్య వచ్చినట్లు ఇదివరకు కంప్లైంట్స్ రాలేదు.

ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్

ఇప్పటికే బ్రెజిల్, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ20 ఫ్యూయెల్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో దీని వినియోగాన్ని పెంచాలని.. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో నితిన్ గడ్కరీ.. ఈ20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇథనాల్-మిశ్రమ ఇంధనం CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని.. ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం 2023లో భారతదేశంలో ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది.

ఈ20 పెట్రోల్ కారణంగా వెహికల్ మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. E20 పెట్రోల్‌తో చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవని చెబుతూ.. చెరకు, మొక్కజొన్న రైతులు ఆర్థికంగా లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక SIAM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే