Breaking News

చెంత ఏఐ ఉందిగా..!

Published on Sat, 08/02/2025 - 09:51

కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు.

‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్‌ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల (ఎస్‌డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్‌ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.

ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం

గూగుల్ ఫ్లాగ్‌షిప్‌ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్‌.. కోర్సులు, టూల్‌కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్‌లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్‌తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్‌తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Videos

బైకును ఎత్తిండ్రు అన్నలు

నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్

సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?

ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..

దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు

నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి

మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని

విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్

చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు

KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)