బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
శ్రీలంకలో వరలక్ష్మీ .. ఎందుకో తెలుసా?
Published on Sat, 08/02/2025 - 09:33
ఎదగడానికైనా, ఎదిగిన తరువాత అయినా ప్రచారం ముఖ్యంగా మారిన రోజులివి. ప్రస్తుతం అలాంటి ప్రచారంలో ఉన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar). ఈమె తెలియని సినీ ప్రేక్షకులు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే వరలక్ష్మీ నటించిన పాత్రలు అంత బలంగా ఉంటాయి. 2012లో పోడాపోడీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈమె శరత్‌కుమార్ వారసురాలు అన్నది తెలిసిందే. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, అలాంటి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయకిగానూ నటించడమే ఈమె ప్రత్యేకత. అలా ఎలాంటి పాత్రకైనా రెడీ అనే వరలక్ష్మీ బహుభాషా నటి కూడా.
తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. కారణాలేమైన ఇప్పుడీమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారనే చెప్పవచ్చు. అందులో భాగంగా శ్రీలంకకు వెళ్లి ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.
శ్రీలంకలో చిన్నమోన్ లైఫ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ ప్రాంతంలో ఈమె ఫొటో షూట్ నిర్వహించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ఫొటోల్లో తనకే సొంతమైన అందంతో పాటు ధైర్యాన్ని వ్యక్తం చేసేలా వరలక్ష్మీ కనిపించడం విశేషం. పలు చిత్రాల్లో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్న వరలక్ష్మీ ఇటీవల నటించిన ది వెర్డిక్ట్ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలను అందుకున్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ నటిగా ముద్ర వేసుకున్న ఈ భామ మరిన్ని వైవిధ్యభరిత కథా పాత్రల
Tags : 1