Breaking News

సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్‌గా..!

Published on Fri, 08/01/2025 - 11:15

మెటాలిక్‌ కలర్, మిర్రర్‌ వర్క్‌ డ్రెస్‌లో నటి ఖుషీ కపూర్‌ హ్యూందయ్‌ ఇండియన్‌ కొచర్‌ వీక్‌లో మెరిసిపోయారు. డిజైనర్‌ రిమ్‌జిమ్‌ దాదు చేసిన ఈ మోడర్న్‌ డిజైన్స్‌కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలర్స్‌కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. 

ఆక్సిడైజ్డ్‌ సిల్వర్, మిర్రర్‌ వర్క్, హెరిటేజ్, మోడర్న్‌ ... అంశాలతో లగ్జరియస్‌ బ్రాండ్‌గా పేరొందిన రిమ్‌జిమ్‌ దాదు ఈ డిజైన్స్‌ రూపొందించారు. ‘ఆక్సిన్‌‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్‌ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు.

ఖుషీ కపూర్‌ ధరించిన కస్టమ్‌ టెక్ట్స్‌టైల్‌ బ్రాకెట్‌–స్టైల్‌ బ్లౌజ్, హై–వెయిస్టెడ్‌ లెహంగా ఎంగేజ్‌మెంట్, రిసెప్షన్‌ వంటి వేడుకలలో హైలైట్‌గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్‌ను రూపొందించారు. మెటాలిక్‌ కలర్‌లోనే స్కర్ట్‌ అంతా మిర్రర్‌ వర్క్‌ చేశారు. 

బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్‌ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్‌ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.  

ఆక్సిడైజ్డ్‌ సిల్వర్, మిర్రర్‌ వర్క్, హెరిటేజ్, మోడర్న్‌ ... అంశాలతో లగ్జరియస్‌ బ్రాండ్‌గా పేరొందిన రిమ్‌జిమ్‌ దాదు ఈ డిజైన్స్‌ రూపొందించారు. ‘ఆక్సిన్‌‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్‌ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు. 

ఇతర మోడల్స్‌ ధరించిన డ్రెస్సులను డిజైనర్‌ దాదు తన బ్రాండ్‌ సిగ్నేచర్‌ మెటల్‌ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్‌ ఫారమ్స్, స్కల్‌ప్చర్‌ డ్రేప్‌లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్‌లో పైస్లీ మోటిఫ్‌లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. 

మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్‌ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు.  

(చదవండి: సెల్ఫ్‌ బ్రాండ్‌..అదే ట్రెండ్‌..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..)

Videos

బైకును ఎత్తిండ్రు అన్నలు

నేషనల్ అవార్డుపై అనిల్ రావిపూడి ఫస్ట్ రియాక్షన్

సమంత చేతికి స్పెషల్ రింగ్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందా..?

ఏం చేస్తారో చేసుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకొక్కడికి..

దొరికిపోతారనే భయంతో సిట్ కుట్రలు

నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి

మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని

విజయనగరంలో చరణ్.. బీభత్సమైన ఫైట్ సీన్స్ లోడింగ్

చంద్రబాబు ఉన్నంతవరకు రైతులకు భరోసా లేదు: చంద్రబాబు

KSR Comment: లోకేష్ ఖబర్దార్.. ఇక కాచుకో.. YSRCP యాప్ రెడీ!

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)

+5

‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవారం పూజలు చేసిన సురేఖవాణి, సుప్రీత (ఫొటోలు)