Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
పరిస్థితులు ఎలా ఉన్నా.. వదులుకోకపోవడం అంటే ఇదే..!
Published on Wed, 07/16/2025 - 13:50
టాలెంట్ ఉన్నోడు దునియానే ఏలతాడు అంటారు. అయితే ఒక్కోసారి ఆ టాలెంట్‌ని ప్రదర్శించే అవకాశం రాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, వచ్చిపడే కష్టాలు ఆ నైపుణ్యం మొత్తాన్ని అణిచేస్తుంటుంది. అలా తమ కళ బయట ప్రపంచానికి చూపించలేక కనుమరుగైన వారెందరో ఉన్నారు కూడా. అలాంటి కథే ఈ సెక్యూరిటీ గార్డుది. పరిస్థితులు ఎంతలా తన టాలెంట్‌ని తొక్కేస్తున్నా..కళను వదులుకోకుండా..వీలుచిక్కినప్పుడల్లా సానపెట్టుకుంటూ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కంటపడ్డాడు. ప్రపంచానికి తన నైపుణ్యం తెలియజేసే అవకాశం అందిపుచ్చుకున్నాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక సెక్యూరిటీ గార్డు స్టోరీ ఇది. అతడి కథ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అతను అసాధారణమైన చిత్రకారుడు. తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి తనకు నచ్చిన అభిరుచిని పక్కనపెట్టాల్సి వచ్చింది. ఒకప్పుడూ పూర్తి సమయం కళకే వెచ్చించిన వ్యక్తి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రియేటివిటీ కెరీర్‌ని వదులుకోవాల్సి వచ్చింది.
కుటుంబ పరిస్థితులు దృష్ట్యా సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయక తప్పలేదు. అయితే పెన్సిల్ లేదా పెన్ను పట్టాడంటే..అతడి చేతి నుంచి అద్భుతమైన చిత్రం జాలు వారాల్సిందే. అయితే ఆ సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తూ కూడా తన పెయింటింగ్ హాబీని వదులుకోలేదు. వీలుచిక్కినప్పుడల్లా అద్భుతమైన చిత్రాలను గీస్తుంటాడు. పైగా పిల్లలకు మంచి మంచి మెళుకువలు నేర్పిస్తాడు కూడా.
అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధన ఛటర్జీ షేర్ చేయడంతో ఒక్కసారిగా అతడి కథ వెలుగులోకి వచ్చింది. అతడి టాలెంట్‌కి ఫిదా అయ్యి ఎందరో అతడికి సాయం అందించడానికి ముందుకు రావడమే కాదు..గ్యాలరీ ప్రదర్శన కోసం అతడితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. పరిస్థితులు ఎలా ఉన్నా కళను వదులుకోని వాడికి ఎన్నటికీ అన్యాయమైపోడు..ఏదో ఒక రోజు ప్రపంచానికి తెలిసేలా గెలుపు పిలుపు తడుతుంది అంటే ఇది కదూ..!.
(చదవండి: మహాత్మా గాంధీ అరుదైన పెయింటింగ్..వేలంలో ఏకంగా..!)
Tags : 1