Breaking News

అవకాశాల వేటలో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌

Published on Wed, 07/16/2025 - 13:44

ఒక్కోసారి సక్సెస్‌ఫుల్‌ నటి అని ముద్ర వేసుకున్నా అవకాశాలు ముఖం చాటేస్తుంటాయి. నటి ప్రియాంక మోహన్‌ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె 2019లో కన్నడ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్, డాన్‌ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. 

అంతేకాకుండా గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇలా సూర్యతో ఎదర్కుమ్‌ తుణిందవన్ (ఈటీ), ధనుష్‌ సరసన కెప్టెన్ మిల్లర్‌ వంటి చిత్రాల్లో నటించి పాపులర్‌ అయ్యారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన 'సరిపోదా శనివారం' చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్‌ దర్శకత్వం వహించి నిర్మించిన 'జాబిలమ్మా నీకు అంత కోపమా' చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. 

తెలుగులోనూ ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దీంతో మడి కట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని గ్రహించారో ఏమోగానీ గ్లామర్‌కు తెర రేపింది. తాజాగా వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. అందులో కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు చోటు చేసుకున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ విధంగా ప్రియాంకమోహన్‌ అవకాశాల వేట మొదలుపెట్టారన్నమాట.

Videos

ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు

జగన్ ప్రశ్నలు.. నీళ్లు నములుతున్న బాబు

Pushpa Sreevani: రోజా కు క్షమాపణ చెప్పు.. లేదంటే

తెలంగాణలో నురగలు కక్కుతున్న కల్తీ కల్లు

స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Nellore: బాబుకు చావుదెబ్బ YSRCPలోకి టీడీపీ కార్పొరేటర్

KSR Live Show: బనకచర్లపై గురుశిష్యుల చీకటి ఒప్పందం

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా మరో మూడ్రోజుల వర్షాలు

నన్ను వద్దు అనటానికి వాడెవడు.. హౌస్ అరెస్ట్ పై పెద్దారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

వినుత డ్రైవర్ హత్యలో పవన్ పాపమెంత?

Photos

+5

ఆషాఢం : ‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)