Breaking News

నటుడు 'రవితేజ' కుటుంబంలో విషాదం

Published on Wed, 07/16/2025 - 07:25

ప్రముఖ టాలీవుడ్‌ హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు (90) వయస్సు, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి నేర్పిన పాఠాల ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నానని గతంలో రవితేజ తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో రాజగోపాల్‌ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యహ్నం 3 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు, మరో కుమారుడు రఘు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్‌ ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. తన ఉద్యోగం కారణంగా ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఆయన గడిపాడు. దీంతో రవితేజ పాఠశాల విద్య 'జైపూర్ , ఢిల్లీ , ముంబై భోపాల్‌'లలో జరిగింది. అందువల్ల రవితేజ చిన్నప్పటి నుంచి వివిధ యాసలు, సంస్కృతులు నేర్చుకున్నాడు. ఇది ఆయన నటనకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని పరిశ్రమలో పలువురు చెబుతారు.

సంతాపం తెలిపిన చిరంజీవి
హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సోదరుడు రవి తేజ తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. రవితేజను ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటాడని, హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు చిరు పేర్కొన్నారు. రాజగోపాల్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.

Videos

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు

అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే

YSRCP ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాద్ లో భారీ వర్షం

రాబర్డ్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలుచేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ

పదేళ్లు సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలకు దూరంగా కేసీఆర్ పాలన చేశారు

భాను ప్రకాష్... వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: వరుదు కల్యాణి

రోజాపై భాను గాలి ప్రకాష్ వ్యాఖ్యలు YSRCP పూర్ణమ్మ ఉగ్రరూపం..

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)