నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌

Published on Wed, 07/16/2025 - 02:09

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీల 4 రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 317 పాయింట్లు పెరిగి 82,571 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 25,196 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్‌ 490 పాయింట్లు బలపడి 82,744 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు ఎగసి 25,245 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆసియాలో కొరియా, జపాన్, హాంగ్‌కాంగ్‌  సూచీలు 1% లాభపడ్డాయి. యూరప్‌ సూచీలు అరశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.

వినిమయ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఆటో 1.50%, ఫార్మా 1.14%, వినిమయ, ఎఫ్‌ఎంసీజీ, 1%, రియల్టి, సర్విసెస్‌ అరశాతం చొప్పున పెరిగాయి.
తొలి త్రైమాసిక నికర లాభం 10% క్షీణత నమోదుతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు 3% నష్టపోయి రూ.1,566 వద్ద నిలిచింది. 

Videos

మాకు ప్రాణహాని ఉంది.. పవన్ కళ్యాణ్ స్పందించకపోతే.. డ్రైవర్ రాయుడు చెల్లి షాకింగ్ కామెంట్స్

Big Question: దొరికిపోయిన డ్రామానాయుడు.. డామిట్.. కథ అడ్డం తిరిగింది..

భాను ప్రకాష్ కామెంట్స్ పై ఆర్కే రోజా ఫైర్

పవన్ కి అన్నీ తెలుసు అందుకే దాక్కున్నాడు..

రైతుల పాలిట మృత్యుపాశాలైన కూటమి ప్రభుత్వ విధానాలు

పార్టీ వాళ్ళు ఏమైనా అవ్వని.. బాబు కోసం పవన్ మౌన దీక్ష

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర?

Palamuru: ప్రభుత్వం ఇచ్చిన కొద్దిడబ్బులపైనే కన్నేసిన మోసగాడు

Rowdy Gang: గజగజ లాడుతున్న బెజవాడ

Hyderabad: దంచికొట్టిన వర్షం

Photos

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)