పహల్గాం ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన
Breaking News
ఆంధ్ర కింగ్ కోసం పాట
Published on Wed, 07/16/2025 - 01:36
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కోసం హీరో రామ్ రచయితగా మారిపోయి ఓ పాట రాశారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
కాగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కోసం రామ్ ఓ పాట రాశారు. ఆయన పాట రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పాటను సంగీత దర్శకుడు– గాయకుడు అనిరుధ్ రవిచందర్ పాడటం మరో విశేషం. ఈ పాట లిరికల్ వీడియో ఈ నెల 18న రిలీజ్ కానుంది. ‘‘మంచి ఎమోషనల్ లిరిక్స్, అనిరుధ్ వాయిస్‌తో ఈ పాట ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్–మెర్విన్ .
Tags : 1