జగన్ బాబుకు కవిన్ అని పేరు పెట్టారు
Breaking News
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
Published on Tue, 07/15/2025 - 10:14
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.
పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.

పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్‌లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు
Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅
That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025
Tags : 1