Breaking News

50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్‌లో 'నయనతార' రెమ్యునరేషన్‌

Published on Sat, 07/12/2025 - 07:01

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్‌లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగపోతున్నారు. 

ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్ ఇప్పటికీ స్టార్‌ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్‌ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. 

అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం.  నయనతార సాధారణంగా యాడ్స్‌ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్‌ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్‌కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్‌ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి చిత్రం సిద్ధం అవుతోంది.

Videos

తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత

డ్రైవర్ చెల్లి కన్నీటి పర్యంతం

అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి

పేర్ని నానిపై అక్రమ కేసులు

సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు

ఒక అన్నగా మాటిస్తున్నా... నీకు అవమానం జరిగిన చోటే మళ్ళీ...

Narayana Murthy: ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా శ్రీనివాసరావు

మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి

ప్రాణాలతో పోరాడుతున్నాడు నాగ మల్లేశ్వరరావు ని పరామర్శించిన సజ్జల

ప్రాణం ఖరీదుతో ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి చిరంజీవి ఎమోషనల్

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)