Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్‌పై చాలా కోపం
Published on Fri, 07/11/2025 - 18:15
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్‌పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)
స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్‌తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో సంజయ్ దత్ మాట్లాడాడు.
'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్‌తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్‌తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్‌పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)
"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.
- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025
Tags : 1