పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు
Breaking News
అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
Published on Fri, 07/11/2025 - 10:15
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్‌గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్‌గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.
ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్‌కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్‌గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
మన దేశంలో 65–70 శాతం స్కూల్స్‌లో సరిౖయెన ప్లేగ్రౌండ్‌లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్‌లు.
(చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...)
Tags : 1