గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు
Breaking News
ఓటీటీలోకి ముగ్గురు హీరోల మాస్ డ్రామా ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Published on Tue, 07/08/2025 - 11:34
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన చిత్రం భైరవం(Bhairavam). విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ 'గరుడన్’ తెలుగు రీమేకే ఈ భైరవం. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది మే 30న థియేటర్స్లో విడుదల చేయగా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. జులై 18 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్త అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ని విడుదల చేసింది.
భైరవం కథేంటంటే..
తూర్పు గోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి(మనోజ్), వరద(నారా రోహిత్),శీను(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ(జయసుధ) మరణించడంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతలు శీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు.
మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ(ఆనంది) ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శీను ఎలా రక్షించాడు. గజపతి గురించి శీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి. అమ్మవారి పూనకం వచ్చే శీను.. న్యాయం కోసం చివరకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రానికి హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా పని చేశారు.
Powerful. Intense. A story that leaves you with an afterthought - BHAIRAVAM
Get ready for a high voltage thriller
Premieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025
Tags : 1