గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
Breaking News
కథ నచ్చితే అలాంటి పాత్ర కూడా చేస్తా : మాళవికా మనోజ్
Published on Tue, 07/08/2025 - 10:55
‘‘గతంలో నేను నటించిన సినిమాల్లో సాధారణంగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలు చేశాను. అయితే ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంలో ఎంతో మోడ్రన్ గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో ఉండే సత్యభామ పాత్రలో నటించా.. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని మాళవికా మనోజ్(Malavika Manoj) తెలిపారు. సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama). హరీష్ నల్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మాళవికా మనోజ్ మాట్లాడుతూ–‘‘నేను తమిళంలో నటించిన ‘జో’లో నా నటన నచ్చడంతో ‘ఓ భామ అయ్యో రామ’కి ఎంపిక చేశారు రామ్ గోధల. నాకు తెలుగు రాకపోయినా.. భావం అర్థం చేసుకుని సత్యభామ పాత్ర చేశాను. సుహాస్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. హరీష్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. రధన్‌గారు మంచి పాటలిచ్చారు. భాషతో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికి నచ్చాయి.
ఈ సినిమాలో హరీష్ శంకర్, మారుతిగార్లతో నటించడం సంతోషంగా ఉంది. నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నచ్చిన కథలు మాత్రమే చేస్తున్నాను. గ్లామరస్ రోల్స్ చేయాలా? వద్దా? అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే చేస్తాను’’ అన్నారు.
Tags : 1