సుప్రీంలో నిమిషా కేసు.. అద్భుతం జరుగుతుందా?
Breaking News
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
Published on Tue, 07/08/2025 - 08:30
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి 'శివశక్తి దత్త' (92) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. అతను తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని వ్రాసినందుకు ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు అనే విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు . రెండు సంవత్సరాల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు . తరువాత సుబ్బారావు తన పేరును శివ శక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్ , సితార్ , హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.
రాఘవేంద్రరావుతో తొలిసారి జానకి రాముడు (1988) కోసం స్క్రీన్ రైటర్‌గా శివశక్తి దత్తా పనిచేశారు. సై , చత్రపతి , రాజన్న , బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కన్‌క్లూజన్ , RRR , హను-మాన్ వంటి చిత్రాలలో వివిధ పాటలకు సాహిత్యం రాశారు . దర్శకుడిగా చంద్రహాస్ (2007) సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో 'సాహోరే బాహుబలి' , 'మమతల తల్లి' 'దీవర' వంటి సాంగ్స్ రాశారు.
Tags : 1