Breaking News

'విక్రమ్ వేద' తర్వాత బిగ్‌ హీరోతో దర్శక ద్వయం సినిమా

Published on Tue, 07/08/2025 - 07:01

సౌత్‌ ఇండియా చిత్రపరిశ్రమకు చెందిన నటుడు శివకార్తికేయన్‌( Sivakarthikeyan) సక్సెస్‌ఫుల్‌ బాటలో పరిగెడుతున్నాడు. ఇప్పటికే అయలాన్‌, మావీరన్‌, అమరన్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన ఆయన ప్రస్తుతం ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మదరాసీ, సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మదరాసీ చిత్రం ముందుగా తెరపైకి రానుందని సమాచారం. కాగా పరాశక్తి తరువాత శివకార్తికేయన్‌ నటించే చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. 

ఇంతకు ముందు మాధవన్‌, విజయ్‌సేతుపతి హీరోలుగా విక్రమ్‌ వేదా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పుష్కర్‌–గాయత్రిల దర్శక ద్వయం ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అయితే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సుడల్‌ అనే వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. అలాంటిది తాజాగా ఈ దర్శక ద్వయం మళ్లీ మెగాఫోన్‌ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటుడు శివకార్తికేయన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 

పుష్కర్‌–గాయత్రి చెప్పిన కథ శివకార్తికేయన్‌కు నచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా నటుడు శివకార్తికేయన్‌ గుడ్‌నైట్‌ చిత్రం ఫేమ్‌ వినాయక్‌ చంద్రశేఖరన్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏ చిత్రం ముందుగా సెట్‌పైకి వెళుతుందో చూడాలి.

Videos

తీన్మార్ మల్లన్న నాపై అసభ్య కామెంట్స్ చేశారు: ఎమ్మెల్సీ కవిత

డ్రైవర్ చెల్లి కన్నీటి పర్యంతం

అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి

పేర్ని నానిపై అక్రమ కేసులు

సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు

ఒక అన్నగా మాటిస్తున్నా... నీకు అవమానం జరిగిన చోటే మళ్ళీ...

Narayana Murthy: ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా శ్రీనివాసరావు

మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి

ప్రాణాలతో పోరాడుతున్నాడు నాగ మల్లేశ్వరరావు ని పరామర్శించిన సజ్జల

ప్రాణం ఖరీదుతో ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి చిరంజీవి ఎమోషనల్

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)