Breaking News

బాబోయ్‌.. రీచార్జ్‌ ప్లాన్‌లు మళ్లీ పెరుగుతాయా?

Published on Mon, 07/07/2025 - 21:47

దేశంలో మొబైల్‌ రీచార్జ్‌  ప్లాన్‌ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లను పెంచవచ్చని తెలుస్తోంది. ధరల పెరుగుదల 10 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ఓ వార్తా నివేదిక తెలిపింది. 2024 జూలైలో బేస్ ధరలను 11 నుండి 23 శాతం పెంచిన భారతీయ టెలికాం కంపెనీలు ఈసారి కొత్త విధానాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మే నెలలో బలమైన క్రియాశీలక యూజర్ల పెరుగుదలే ఈ పెంపునకు కారణమని చెబుతున్నారు.

మళ్లీ మొబైల్ టారిఫ్‌ల పెంపు
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ టారిఫ్‌లపై తాజా పెంపును విధించవచ్చని ఈటీ టెలికాం నివేదిక తెలిపింది. ఈ పెరుగుదల 10-12 శాతం మధ్య ఉంటుందని, మిడ్-టు-హై-ప్రైస్ రీఛార్జ్ ప్లాన్లను కొనుగోలు చేసే వినియోగదారులను కంపెనీలు లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపింది.

టారిఫ్‌ల పెంపుతో యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు వేరే టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు మళ్లకుండా ఆపరేటర్లు టైర్డ్ విధానంపై దృష్టి సారించారు. మే నెలలో యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల బలమైన వృద్ధి మరోసారి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ 31 రోజుల్లో భారతీయ టెలికాం రంగంలో 7.4 మిలియన్ల క్రియాశీల చందాదారులు పెరిగారు. 29 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.08 బిలియన్లకు చేరింది.

Videos

ప్రాణం ఖరీదుతో ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి చిరంజీవి ఎమోషనల్

ఎవరో నేను తెలుగోడు కాదంటే.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

చనిపోయేవరకు సినిమాలు మాత్రం వదలనన్నారు పవన్ ఎమోషనల్

కోట మృతిపై అల్లు అరవింద్ రియాక్షన్

మా బాబాయ్ అంటూ.. శ్రీకాంత్ ఎమోషనల్

రప్పా రప్పా వ్యాఖ్యలపై పేర్ని నాని క్లారిటీ

ఏం యాక్టింగ్ గురు.. కోట సినీ బయోగ్రఫీ

ఏం నేరం చేశారని ఉప్పాల హారికపై గుడివాడలో దాడులు చేయించారు? : వైఎస్ జగన్

కోటన్నా అంటూ.. కంటతడి పెట్టిన బాబు మోహన్

కోట శ్రీనివాసరావు చివరి వీడియో

Photos

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)

+5

అనంత్‌-రాధిక వివాహ వార్షికోత్సవం.. అంబరమంటిన పెళ్లికి అప్పుడే ఏడాది.. (ఫోటోలు)

+5

నోరూరించే పులస వచ్చేస్తోంది..రెడీనా! (ఫొటోలు)

+5

తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)

+5

నోవోటెల్‌ వేదికగా జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2025 (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అమెరికా స్వాతంత్ర్య దిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

‘యువి కెన్‌’ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన భార‌త ప్లేయ‌ర్లు (ఫోటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో వరుణ్‌తేజ్‌.. చాయ్‌ తాగుతూ (ఫోటోలు)