ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం
Breaking News
'రామ్‌చరణ్ ఒప్పుకోకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు'.. దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి
Published on Wed, 07/02/2025 - 17:54
మెగా హీరో రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ ఛేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.
నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ..'మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్‌వీసీ సంస్థకు, రామ్ చరణ్‌కు అవినాభావ సంభంధం ఉంది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మాట దొర్లినా రామ్ చరణ్‌కు, అభిమానులకు నా క్షమాపణలు. నేను అన్న ఉద్దేశం కాదు. మాకు మెగా హీరోలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి వాళ్లను నేను అవమానించేంత ముర్ఖుణ్ణి కాదు. రామ్ చరణ్ వల్లే సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశాం. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అంటాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ప్రవర్తించకండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కావడం వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి. త్వరలోనే రామ్ చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
Tags : 1