Breaking News

12 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసే యోచనలో జీఎస్టీ?

Published on Wed, 07/02/2025 - 16:56

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను హేతుబద్ధీకరించాలనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతంగా ఉన్న శ్లాబ్‌ను పూర్తిగా తొలగించడం అనే కీలక ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది.

ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధించే వస్తువుల్లో చాలా వరకు సాధారణ పౌరులు దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అధికంగా వినియోగించే ఉత్పత్తులు ఈ శ్లాబ్‌లో ఉన్నాయి. కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ వస్తువులను తక్కువగా 5% పన్ను పరిధిలో వర్గీకరించాలని యోచిస్తోంది. తుది వినియోగదారులకు ఆయా వస్తువులను చౌకగా అందించాలనే లక్ష్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రభుత్వం 12% శ్లాబ్‌ను పూర్తిగా రద్దు చేసి ఆయా వస్తువుల్లో కొన్నింటిని ప్రస్తుతం దాని కంటే తక్కువగా ఉన్న 5% శ్లాబ్‌, కొన్నింటిని ఎక్కువగా 18% శ్లాబులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ప్రకారం మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం. అయితే ఈ నెలాఖరులో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌కు పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేసే అధికారం ఉంది.

ఇదీ చదవండి: ‘యాపిల్‌ రహస్యాలు దొంగతనం’

12 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోని వస్తువుల వివరాలు..

  • ప్రాసెస్డ్‌ ఫుడ్‌: పాలు, జున్ను, వెన్న, నెయ్యి, ఫ్రోజెన్‌ మీట్‌.

  • డ్రైఫ్రుట్స్‌, గింజలు: బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరం

  • నూనెలు: ఫిష్ ఆయిల్, లానోలిన్, పౌల్ట్రీ కొవ్వు.

  • టెక్స్‌టైల్‌, దుస్తులు: రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, సింథటిక్ నూలు

  • ఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కంప్యూటర్ ఉపకరణాలు

  • ట్రావెల్ & హాస్పిటాలిటీ: బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లు

  • నిర్మాణ సామగ్రి: సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్

#

Tags : 1

Videos

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం

నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు

హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యాం అనే వ్యక్తి

పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో బాబు చెలగాటం: మేరుగు నాగార్జున

వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్

చిత్తూరుకు YS జగన్

Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు

Venkatram Reddy: కూటమి సర్కార్ కంటే YSRCP పాలనే బెటర్

గిట్టుబాటు ధరల్లేవని మామిడిని రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు

చాలాకాలం తర్వాత వెలుగులోకి ఇరాన్ సుప్రీం లీడర్

Photos

+5

ENG Vs IND 2nd Test : ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 06-13)

+5

ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్‌ఫ్రే మెచ్చిన ప్రదేశం..ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఇది..! (ఫోటోలు)

+5

భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్‌ (ఫోటోలు)

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)