డకాయిట్ నుంచి శృతి హాసన్‌ అవుట్‌.. కారణం అదేనన్న అడివి శేష్‌!

Published on Tue, 07/01/2025 - 17:33

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌  నటిస్తోన్న తాజా డగాయిట్. క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన షానీల్‌ డియో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.  ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్‌ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్‌ మూవీ తప్పుకోవడంపై అడివి శేష్ స్పందించారు. శృతిహాసన్‌తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

(ఇది చదవండి: 'డకాయిట్‌' ఫైర్‌ గ్లింప్స్‌ విడుదల)

డకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై ఎలాంటి వివాదం లేదని అడివి శేష్ అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరక పోవడం  వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతిహాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు.

అడివి శేష్ మాట్లాడుతూ..'కూలీతో ఆమె బిజీగా ఉన్నారు. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్‌లో నాకు సింక్ అవ్వాలి. అంతే తప్ప ఇందులో ఎలాంటి వివాదం లేదు. మృణాల్ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారు. పది గంటలకు కథ చెప్పగానే.. మధ్యాహ్నం ఒంటిగంటకే ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అరవై శాతం పూర్తయింది' అని పంచుకున్నారు. కాగా.. డకాయిట్ మూవీని తెలుగు, హిందీలో ఓకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

అమెరికాను కుదిపేస్తున్న ట్రంప్ తెచ్చిన One Big Beautiful Bill

ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో VRSకు దరఖాస్తు

రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి

ఛీ..ఛీ.. ఇదేం తిండి!

మీ భవిష్యత్తు నాది..! కార్యకర్తలకు జగన్ భరోసా

ఈ గేదె ధర.. 14 లక్షలు

Vallabhaneni Vamsi: అన్ని కేసుల్లో బెయిల్.. నేడే విడుదల..!

KSR లైవ్ షో: ఐపీఎస్ పోస్టుకు సిధ్ధార్థ్ కౌశల్ గుడ్ బై!

బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభా వేదికపై అసంతృప్తి గళాలు

Photos

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)