నా రియల్ లైఫ్‌లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ

Published on Tue, 07/01/2025 - 16:07

తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో  హీరోయిన్‌గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జాబ్‌ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.

నితిన్‌ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్‌ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్‌లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌ ‍అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.

లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్‌కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.

కాగా.. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో నితిన్‌ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది.
 

Videos

పవన్ నిన్ను నమ్ముకుంటే.. అడుక్కునే స్టేజికి తీసుకొచ్చావ్..

అమెరికాను కుదిపేస్తున్న ట్రంప్ తెచ్చిన One Big Beautiful Bill

ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో VRSకు దరఖాస్తు

రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి

ఛీ..ఛీ.. ఇదేం తిండి!

మీ భవిష్యత్తు నాది..! కార్యకర్తలకు జగన్ భరోసా

ఈ గేదె ధర.. 14 లక్షలు

Vallabhaneni Vamsi: అన్ని కేసుల్లో బెయిల్.. నేడే విడుదల..!

KSR లైవ్ షో: ఐపీఎస్ పోస్టుకు సిధ్ధార్థ్ కౌశల్ గుడ్ బై!

బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభా వేదికపై అసంతృప్తి గళాలు

Photos

+5

తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుత‌మైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

తమ్ముడుతో టాలీవుడ్‌లో ఎంట్రీ.. అప్పుడే లైన్‌లో పెట్టేసిందిగా! (ఫోటోలు)

+5

ఏపీ : అమ్మో ఒకటో తారీఖు.. పరుగులు పెట్టాల్సిందే (ఫొటోలు)

+5

‘సోలో బాయ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అందాల శ్రీలంక..అద్భుత ఎంపిక (ఫొటోలు)

+5

బల్కంపేట : వైభవోపేతంగా ఎల్లమ్మ పోచమ్మ కల్యాణోత్సవం..ఉప్పొంగిన భక్తిభావం (ఫొటోలు)

+5

ఈ ఏడాది చాలా స్పెషల్.. పెళ్లి రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మహాతల్లి జాహ్నవి..!

+5

ఔరా..! అనిపించే ఆరోవిల్లే టూరిజం..! ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పర్యాటక ప్రదేశం

+5

'అట్లీ' సినిమా కోసం ముంబై బయల్దేరిన అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

విశాఖపట్నం : సాగరతీరంలో సందర్శకుల సందడి (ఫొటోలు)