తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు
Breaking News
పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా చూలేదు : కాంతర హీరోయిన్
Published on Tue, 07/01/2025 - 14:02
‘పుష్ప’ చిత్రంలో రష్మిక చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆఫర్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. కానీ కాంతర సక్సెస్ తర్వాత నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇదే. డిఫరెంట్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తా. కమర్షియల్ సినిమా చేయడం కూడా ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ చిత్రమే’ అని అన్నారు కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సప్తమి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి "తమ్ముడు" మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. "తమ్ముడు" మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.
→ అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది.
→ "తమ్ముడు" కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది.
→ కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
→ పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను ఆ సినిమాను చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.
→ "తమ్ముడు" సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
→ ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు "తమ్ముడు" మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.
→ ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా.
Tags : 1