Breaking News

81,000 దిగువకు సెన్సెక్స్‌

Published on Wed, 06/04/2025 - 04:20

ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్‌ సూచీలు మంగళవారం ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.

ఇంధన, ఫైనాన్స్, ఐటీ షేర్లలో భారీగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 799 పాయింట్లు క్షీణించి 80,575 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 24,502 వద్ద కనిష్టాన్ని తాకాయి. అమెరికా తయారీ రంగం వరుసగా మూడోనెలా తగ్గుముఖం పట్టడంతో పాటు చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలల్లో తొలిసారి క్షీణించినట్లు డేటా రావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.  

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడి 86.61 వద్ద స్థిరపడింది.
అదానీ గ్రూప్‌ ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్‌ ఎల్‌పీజీ దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణల నేపథ్యంలో గ్రూప్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌డీటీవీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 2.50% – 2% క్షీణించాయి. 

ప్రోస్టార్మ్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.105)తో పోలిస్తే 19% ప్రీమియంతో రూ.125 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 24% ఎగసి రూ.130 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 20% లాభంతో రూ.126 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.743 కోట్లకు చేరింది.

Videos

వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్

డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్

Trinamool: ఎంపీ రహస్య వివాహం

చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ

జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్

ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలి: 11 Fans Dead in Stampede

Photos

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కమల్‌ హాసన్ 'థగ్‌ లైఫ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)

+5

అంబరాన్నంటిన సిరిమాను సంబరం