Breaking News

ఇది సఫ(బ)ల తెలంగాణ

Published on Tue, 06/03/2025 - 10:42

మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్‌ బెర్త్‌ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్‌ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని  నిర్వహించింది. 

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్‌ఎస్‌ మొదటి కేబినెట్‌లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్‌ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్‌లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్‌ ఉమెన్స్‌ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’, ‘తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. 

తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్‌ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్‌ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది.  మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్‌కు, ఊబకాయానికి చెక్‌

మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్‌లు ఏర్పాటు చేసింది. ఈ బజార్‌లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్‌ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది.  మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది.  

ఇలా  నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. 

-ఇందిరా శోభన్‌
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు

Videos

వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్

డ్రగ్స్ దందాలో ఏపీ పోలీసులు

Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎనౌకౌంటర్

Trinamool: ఎంపీ రహస్య వివాహం

చంద్రబాబు, పవన్, లోకేష్ పై బియ్యపు మధుసూదన్ రెడ్డి పంచులే పంచులు

మంత్రి కొండా సురేఖకు అస్వస్థత

TS Cabinet Meeting: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల నివేదికపై చర్చ

జగన్‌ని చూస్తే వాళ్లకు వెన్నులో వణుకు చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్

ఆర్‌సీబీ ఫ్యాన్స్ బలి: 11 Fans Dead in Stampede

Photos

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అందమైన అభయారణ్యం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కమల్‌ హాసన్ 'థగ్‌ లైఫ్‌' మూవీ HD స్టిల్స్‌

+5

విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)

+5

Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం (ఫొటోలు)

+5

బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ఆలియా భట్ (ఫొటోలు)

+5

ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)

+5

అంబరాన్నంటిన సిరిమాను సంబరం