వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్
Breaking News
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
Published on Tue, 06/03/2025 - 09:34
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు తగ్గి 24,634కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 ప్లాయింట్లు దిగజారి 81,044 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.41 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.67 శాతం పుంజుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్‌లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్‌బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1