Breaking News

కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్‌ బ్యాగ్‌తో

Published on Fri, 05/23/2025 - 16:39

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కాన్స్‌  ఫిలి ఫెస్టివల్‌ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)  మరోసారి సంచలనం రేపింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిలుక లాంటి గౌనుతో పాటు చిలుక క్లచ్‌తో తొలిసారి మురిపించిన ఈ బ్యూటీ  ఈ సారి ఏకంగా  గోల్డ్‌, డైమండ్స్‌తో రూపొందించిన 'బికినీ' బ్యాగ్‌తో  కనిపించి అందర్నీ ఆశ్చర్యపర్చింది.  ఈ డైమండ​బ్యాగ్‌ ధర ఎంతో తెలుసా?

గత కొన్నేళ్లుగా కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ సందడిలో ఎక్కువగా వినిపించే పేరు ఊర్వశి రౌతేలా. అలాగే వివాదాలకు కూడా తక్కువేమీ కాదు. మొన్న చిలక క్లచ్‌తో వివాదాన్ని రూపి, కొంతమంది‌నెటిజన్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ, ఖరీదైన బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పైకి తిరిగి వచ్చింది. దీని ధర. రూ. 5.29 లక్షల బస్ట్ గోల్డ్ బికినీ బ్యాగ్‌ను  ప్రదర్శించడం  చర్చకు దారి తీసింది.  అంతేకాదు  ఈ ఫెస్టివల్లో మొదటి రోజు ఆమో ధరించిన  చిలుక క్లచ్ కూడా జుడిత్ లీబర్‌ బ్రాండ్‌కు సంబంధించిందే.. దీని ధర రూ. 4.86లక్షలు.

బంగారు రంగు ఫిష్‌టైల్-స్టైల్ గౌనులో నటి లా వెన్యూ డి ఎల్'అవెనిర్ (కలర్స్ ఆఫ్ టైమ్) ఉర్వశి రౌతేలా  ఈ ప్రదర్శనకు హాజరైంది. ఈ గౌను అభిమానులను మంత్రముగ్ధులను చేసినప్పటికీ,  హైలైట్‌గా నిలిచించి మాత్రం గోల్డ్‌ బికినీ  బ్యాగ్.

ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్‌ వెల్వెట్‌ గౌను : ఐశ్వర్య సెకండ్‌ లుక్‌పై ప్రశంసలు

 

లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్  బస్ట్-షేప్డ్‌ బికినీ బ్యాగ్‌ను ధరించింది.  మెటాలిక్ గోల్డ్ బికినీ టాప్‌తోపాటు,  ఖరీదైన రత్నాలు,  స్ఫటికాలు, వివిధ ఆకారాలు, కట్‌లు, ఫ్యాన్సీ నెక్లెస్‌ల కలగలుపుతో  తయారు చేశారు. చేయబడింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, బ్యాగ్ షాంపైన్-టోన్డ్ మెటల్ హార్డ్‌వేర్‌తో పుల్-ట్యాబ్ మాగ్నెటిక్ క్లోజర్‌ను కలిగి ఉంది.  షోల్టర్‌ చైన్‌తోపాటు, మెటాలిక్ లెదర్-లైన్డ్ ఇంటీరియర్‌తో  కూడా వచ్చింది. ఇక ధర విషయాని వస్తే దీని ధర 6,195  అమెరికన్‌  డాలర్లు. అంటే దాదాపు రూ. 5,29,000 అవుతుంది. ఈ బస్ట్ బ్యాగ్ ఎనిమిది ఇతర వేరియంట్లలో  అందుబాటులో ఉంది.

 చదవండి: బనారసీ చీరలో నీతా అంబానీ లుక్‌ : లగ్జరీ బ్యాగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

ఫోటోషూట్‌ కోసం  ఊర్వశి ఏం చేసిందంటే..

కాన్స్‌  ఫిల్మ్ ఫెస్టివల్ 2025, ఊర్వశి రౌతేలా మెట్లపై ఫోటోషూట్ సమయంలో ఎవ్వరినీ లోపలికి రావడానికి వీల్లేకుండా, దారిని బ్లాక్‌ చేసిందట. రెడ్ కార్పెట్‌ కి వెళ్లేముందు హోటల్ మెట్ల మార్గంలో ఫోటోషూట్ చేయించుకుంది. ఈ సందర్భంగా ఇతర అనేక మంది ఇతర అతిథులకు  ఆటంకం కల్పించింది. కనీసం వారినిచూసి అని పక్కకు తప్పుకోకుండా,  తన  పోజుల్లో మునిగిపోవడంతో  వారు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం.  

 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)