Breaking News

థియేటర్స్‌లో వాటి ధరలు తగ్గిస్తే బెటర్‌: ఎస్‌కేఎన్‌

Published on Fri, 05/23/2025 - 15:00

తెలుగు రాష్ట్రాల్లో  సినిమా థియేటర్లు మే 31వ తేదీ నుంచి బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయబడతాయి. తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ అంశంపై  స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్‌ వేడుకలో ఆయన పలు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. చిత్రపరిశ్రమ  ఐసీయూలో ఉందని, ప్రస్తుతం యాంటీ బయాటిక్స్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

'సినిమా  పర్సంటేజీల విధానం కంటే మనం ముందు ప్రేక్షకులను థియేటర్స్‌ రప్పించాలి. ఈ విషయంలో  వారి నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్‌ ఉన్నాయి. టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్స్‌లో దొరికే తినుబండారాల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. సినీ పెద్దలు వీటిపై  దృష్టి పెట్టాలి.  ఆపై ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. రెండు వారాల్లో ఎటూ ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది కదా అని ఆడియన్స్‌ అనుకుంటున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.  

ఉదయం ఆటకు వచ్చే ఆడియన్స్ భారీగా‌ తగ్గిపోతున్నారు. కేవలం ఈవెనింగ్‌ షో, వీకెండ్స్‌లలో మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్‌కు బాగా వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మాములు రోజుల్లో టికెట్‌ ధరలు తగ్గించడం,   వీకెండ్స్‌లో ధరలు పెంచడం వంటి విధానంపై ఆలోచన చేస్తే బెటర్‌ అనుకుంటున్నాను. ప్రస్తుతం కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలు సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.' అని ఆయన గుర్తుచేశారు.

సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. తమకు మల్టీప్లెక్స్‌ తరహాలోనే వచ్చే ఆదాయంలో పర్సెంటేజీ విధానాన్ని అమలుచేయాలంటూ సింగిల్‌ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. అలా చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకి లేఖ రాశారు.  ఈ సమస్యను పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలా పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతే సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఎస్‌కేఎన్‌ అభిప్రాయపడ్డారు.

Videos

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)