Breaking News

కరోనా బారిన బాలీవుడ్‌ నటి ఫ్యామిలీ, ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Fri, 05/23/2025 - 12:39

కరోనా మహమ్మారి  మరోసారి దేశంలో విస్తరిస్తోంది.   తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250 కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో, మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది రెండవ అత్యధికం.  అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళలకు కోవిడ్‌ సోకినట్ట నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.  మహారాష్ట్ర ఈ సంవత్సరం రెండు COVID-సంబంధిత మరణాలను కూడా నివేదించింది

 బాలీవుడ్‌ నటి,  బిగ్ బాస్ 18 పోటీదారు శిల్పా శిరోద్కర్‌ తనకు సోకిందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి కోవిడ్‌ బారిన పడినట్టు జాతీయమీడియా నివేదించింది. కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ మూవీల్లో నటించిన నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు, ఆమె కుటుంబంలో తల్లి ఇద్దరూ వైరస్ బారిన పడ్డారని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19) తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా తెలిపింది.   స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపింది.  ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.   గతంలో కూడా నికిత కోవిడ్‌ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది.


 

Videos

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)