Breaking News

వాళ్లే ఆదర్శం.. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటా: బెల్లంకొండ

Published on Thu, 05/22/2025 - 19:08

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’.  జయంతిలాల్‌ గడా సమర్పణలో విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.  సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌ కార్యక్రమాలలో మేకర్స్‌ బిజీగా ఉన్నారు. తాజాగా దర్శకుడితో పాటు ముగ్గురు హీరోలు యాంకర్‌ సుమతో ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి అభిప్రాయం చెప్పాలని బెల్లంకొండ  శ్రీనివాస్‌ను సుమ అడిగింది. అందుకు వారు చెప్పిన సమాధానం నెట్టింట వైరల్‌ అవుతుంది.

బెల్లంకొండ  శ్రీనివాస్‌ పెళ్లిని ఉద్దేశిస్తూ.. దర్శకుడు విజయ్‌ కనకమేడల ఇలా అంటాడు 'పెళ్లి గురించి చెప్పడానికి ఏమీ లేదు.. అంతా డాడీనే' అంటూ నవ్వేస్తాడు. ఆపై పక్కనే ఉన్న మనోజ్‌ కలుగజేసుకుని ఇలా అంటాడు.. 'నిద్రలేచాక నువ్వు అన్ని విషయాలు మరిచిపోతున్నావ్‌ కదా తమ్ముడు రోజుకొక పెళ్లి అంటే కష్టం' అని అంటాడు.  బహుషా 'భైరవం' సినిమాలో శ్రీనివాస్‌ పాత్ర మతిమరుపుతో సంబంధం ఉండొచ్చు. అయితే, చివరగా తన పెళ్లి గురించి బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇలా అంటాడు. 'కొంతమంది హీరోలను ఆదర్శంగా తీసుకుని రెండుమూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకుంటున్నాను.' అని అంటాడు. సరదాగా సాగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్‌ అవుతుంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ఏ హీరోలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు రెండో పెళ్లి చేసుకున్నారని నువ్వు కూడా అలా చేసుకుంటానని ఎలా కామెంట్‌ చేస్తావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. మనోజ్‌కు కౌంటర్‌గానే శ్రీనివాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చెబుతున్నారు. బెల్లంకొండ వ్యాఖ్యలు ఎవరిపై ఉండొచ్చు అనేది తెలిస్తే మీరూ కామెంట్‌  చేయండి.

Videos

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

COVID Guidelines: ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)