మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
ప్లాస్టిక్ కాలుష్యం అంతం : చిన్నారుల పెయింటింగ్స్ అద్భుతం
Published on Thu, 05/22/2025 - 16:46
సనత్‌నగర్: చిన్నారులు అద్భుత చిత్తరువులతో అమూల్య సందేశాన్ని అందించారు. ప్లాస్టిక్ భూతంతో పర్యావరణాన్ని మనమే హరించేస్తున్నామంటూ ఆ చిన్ని మస్తిష్కాలు హెచ్చరించాయి. ఇకనైనా మేల్కోకపోతే భవిష్యత్తు తరాలు ప్రశ్నార్థకం అంటూ ఆ చిట్టి బుర్రలు గీసిన చిత్రాలు స్ఫూర్తిని నింపాయి. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటూ వెళ్తుండటం మానవ మనుగడకు శ్రేయస్కరం కాదంటూ బొమ్మలతో మేల్కొల్పే ప్రయత్నం చేశారు.
చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీజీపీసీబీ(తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు జవహర్ బాలభవన్‌లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి కదిలి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే అంశంపై ఆలోచింపజేసే చిత్రాలను గీశారు. దాదాపు 250 మంది విద్యార్థులు పర్యావరణ సంబంధిత అంశాలపై అందమైన చిత్రాలను గీసి పెయింటింగ్ వేశారు. ముఖ్యంగా భూమి, నీరు, గాలి, ప్లాస్టిక్ కాలుష్యం, ఎనర్జీ సేవింగ్, నీటి సంరక్షణ, మ్కొలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు, కాలుష్యం నుంచి భూమిని రక్షించే అనేక అంశాలపై చిత్రాలను గీశారు. విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు వచ్చేనెల 5న పర్యావరణ దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ ధర్మేందర్, డ్రాయింగ్ మాస్టర్లు నరేందర్, రాములు, మల్లేశం, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్
Tags : 1