73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
ఇవాళ ఏ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలబ్బా? ఇపుడిదే ట్రెండ్!
Published on Thu, 05/22/2025 - 12:17
నగరం కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. విభిన్న రుచుల సంగమం. శతాబ్దాలుగా బిర్యానీ పరిమళాలతో పేరుగాంచిన మన నగరం, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సంస్కృతిలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. బిర్యానీ, హలీం వంటి క్లాసిక్ వంటకాలు ఎప్పటికీ చిరపరిచితమైనవే అయినా, ఇప్పుడు కొత్త తరహా ఫ్యూజన్ ఫుడ్, ఇంటర్నేషనల్ వంటకాలతో నగర వీధులు ఘుమఘుమలకు వేదికలుగా మారిపోయాయి. ఫుడ్ అంటే కేవలం తినేది కాదు.. ఇప్పుడు అది అనుభవించే జీవనశైలి భాగంగా మారింది. దీనికి ఫుడ్ బ్లాగింగ్ మరింత ప్రాచుర్యాన్ని కలి్పస్తోంది. విదేశీ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్‌టూర్‌లో భాగంగా నగరంలో సందడి చేస్తున్నారు. వారి వీడియోలు విశ్వవ్యాప్తంగా వైరల్‌గా మారుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
లైఫ్‌స్టైల్ ఫుడ్‌కి కొత్త నిర్వచనం..
ఇప్పుడు ఫుడ్ తినడం కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఫ్రెండ్స్‌తో రాత్రివేళ స్ట్రీట్ టూర్‌కు వెళ్లడం, కొత్త స్టాల్ కనుగొనడం, అందులో ప్రత్యేకమైన ఐటెం రుచి చూసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇవన్నీ ఒక లైఫ్‌స్టైల్‌గా మారిపోయాయి. ‘నేడు ఏ స్ట్రీట్ ఐటెం ట్రై చేయాలి?’ అనే ప్రశ్న, ప్రతీ ఫుడ్ లవర్ డైలీ రొటీన్‌లో భాగం అయ్యింది. ఇప్పటి యువత కేవలం రెస్టారెంట్‌లకే పరిమితం కాలేదు. వీధుల్లో అందుబాటులో ఉన్న కొత్త రుచుల కోసం క్యూ కడుతున్నారు. చిన్న చిన్న బండ్లపై కనిపించే పైనాపిల్ డోసా, బబీ బాట్స్, ఫైర్ పానీపూరీ, ఐస్ మలై టిండి వంటి ప్రయోగాత్మక ఐటెమ్స్ ఇప్పుడు హాట్ ట్రెండ్స్. సికింద్రాబాద్ మటన్ కీమా దోసా, హిమాయత్‌నగర్ తిబ్బటన్ మోమోస్, గచ్చిబౌలి కొరియన్ స్ట్రీట్‌ఫుడ్ – ఇవన్నీ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
ఫుడ్ బ్లాగింగ్ ట్రెండ్..
ఈ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది ఫుడ్ బ్లాగింగ్. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ వేదికలపై హైదరాబాదీ యువత ఫుడ్ రీల్స్, రివ్యూలతో వైరల్ కంటెంట్ సృష్టిస్తున్నారు. బండి వద్ద కూర్చొని తినే ఒక చిన్న వీడియో లక్షల వ్యూస్‌ను తెచ్చిపెడుతోంది. ఫుడ్ బ్లాగర్ల ప్రసారం వల్ల చిన్న స్టాల్స్‌కు కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడం విశేషం. ‘‘అవి కేవలం బండ్లు కావు, అవి డ్రీమ్ టేస్టీ హబ్స్‘గా మారుతున్నాయి. ఎక్కడికైనా కొత్తగా ఓ వెరైటీ వంటకం కనిపిస్తే క్యూ కడుతున్నారు. ఇలా బ్లాగర్ల దృష్టిలో పడితే చిన్న ఫుడ్ స్టాల్స్‌కు కూడా గుర్తింపు వస్తోంది.
హైదరాబాదీ ఫుడ్ అదుర్స్..
ఈమధ్య యూఎస్‌ఏకి చెందిన క్రిష్ లూయిస్ ఫుడ్ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడి స్పైసీ ఫుడ్, స్వీట్లు, పరోటా, చికెన్–65, రోడ్‌సైడ్ మిర్చి తనకు ఎంతో నచ్చాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కొంతమంది విదేశీ ఫుడ్ వ్లాగర్లు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వీధి వంటకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్న చిన్న పానీపూరీ బండ్ల దగ్గర నిలబడి, ‘ది బెస్ట్ థింగ్ ఐ ఎవర్ ఈట్!’ అంటూ ఇంగ్లిష్‌లో చెప్పే మాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యాయి. వీధి వంటల అద్భుత రుచితో ఇక్కడి ఆతిథ్యం, సరదా వాతావరణం వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో విదేశీయుల కళ్లలో కూడా నగరం ఒక ఫుడ్ డెస్టినేషన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఫుడ్ వ్లాగర్లు హైదరాబాదీ స్ట్రీట్ ఫుడ్‌ను మరింతగా ప్రచారం చేస్తున్నారు. ‘ఇంత అతంటిక్ ఫుడ్ వీధుల్లో దొరుకుతుందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్‌ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
ఫుడ్ క్రియేటివిటీతో.. హైదరాబాద్ ఇప్పుడు కేవలం చారిత్రక కట్టడాల నగరమే కాదు. ఇది రుచుల పండుగలా మారింది. స్ట్రీట్‌ఫుడ్ ద్వారా స్థానికులు తమ క్రియేటివిటీని చూపిస్తూ, జీవనశైలిని కొత్త కోణంలో నిర్వచిస్తున్నారు. ఫుడ్ బ్లాగర్లు, ఫుడ్ ప్రియులు, ప్రయాణికులు అందరూ కలిసి ఈ నగరాన్ని ఒక రుచుల ప్రయాణ కేంద్రంగా మార్చేశారు.
Tags : 1