73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Published on Thu, 05/22/2025 - 09:48
గురువారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 644.64 పాయింట్లు లేదా 0.79 శాతం నష్టంతో 80,951.99 వద్ద, నిఫ్టీ 203.75 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 24,609.70 వద్ద నిలిచాయి.
కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్‌కో సిస్టమ్, అలికాన్ కాస్టల్లాయ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, గీకీ వెంచర్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.41 శాతం పడిపోయింది.
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్‌లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య అధికమవుతుంది. వారం రోజుల్లో 170కి పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1