పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం
Breaking News
నేను కూడా సెల్ఫిష్.. రివ్యూల విషయంలోనూ అంతే: సమంత
Published on Fri, 05/16/2025 - 19:33
హీరోయిన్ సమంత ప్రస్తుతం శుభం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టిన సామ్.. కొద్ది రోజులుగా ఫుల్ బిజీ అయిపోయింది. సామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన శుభం మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో సమంత సైతం అతిథి పాత్రలో మెరిసింది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన శుభం సక్సెస్ మీట్‌లో సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా సినిమా రివ్యూల గురించి ప్రస్తావించింది.
(ఇది చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ)
తాను కూడా సినిమా రివ్యూలను చదువుతానని సామ్ తెలిపింది. అయితే కేవలం తన పాత్రకు సంబంధించినంత వరకే పరిమితమవుతానని వెల్లడించింది. నా గురించి చదివాకే.. మిగిలిన వారి గురించి చూస్తానని సమంత పేర్కొంది. ఈ విషయంలో నేను కూడా చాలా సెల్ఫిష్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ . కానీ, నిర్మాతగా మారాక అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపింది సమంత.
Tags : 1