రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..
Breaking News
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
Published on Tue, 05/06/2025 - 09:40
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 11 పాయింట్లు పెరిగి 24,465కు చేరింది. సెన్సెక్స్(Sensex) 6 పాయింట్లు పుంజుకుని 80,807 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.87 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 61.16 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.64 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.74 శాతం దిగజారింది.
ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో స్టాక్ సూచీలు సోమవారం ఈ ఏడాది(2025) గరిష్టంపై ముగిశాయి. అంతర్జాతీయ వాణిజ్య ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగరావడంతో దేశీయ ఆయిల్ రిఫైనరీ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1