మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
నా వయస్సు పెరిగింది.. రివ్యూల నంబర్ కూడా పెరగాలి: శ్రీ విష్ణు
Published on Tue, 05/06/2025 - 08:44
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి డైరెక్టర్‌గా కార్తీక్ రాజు పనిచేస్తున్నారు. ఇటీవలే సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే శ్రీ విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సినిమాలో రివ్యూల అంశంపై ఆయన మాట్లాడారు. రివ్యూలను మనం ఆపలేము.. మార్చలేము అన్నారు. కానీ రేటింగ్ నంబర్స్ మారితే బాగుంటుందని శ్రీ విష్ణు తెలిపారు.
(ఇది చదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు)
నా చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీతో పాటు అన్ని మారుతూ వచ్చాయని అన్నారు. నా వయస్సు కూడా పెరిగిందని.. అలాగే రేటింగ్ సిస్టమ్‌లో ఐదు పాయింట్లకు బదులు 50 నుంచి 100కు పెంచితే బాగుంటుందని శ్రీ విష్ణు సూచిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ అయినా అనలిస్ట్‌ల్లాగే.. ఇది కూడా అనలైసిసే కదా అన్నారు. రివ్యూల్లో చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ కావొచ్చు.. కాకపోవచ్చని తెలిపారు. ఎక్కువ నంబర్స్ ఇస్తే బాగుంటుందని.. ఒక్కసారి ట్రై చేయాలని శ్రీ విష్ణు సూచించారు.
Tags : 1