Breaking News

ముద్దు సీన్‌ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో

Published on Mon, 05/05/2025 - 17:12

ఈ కాలం సినిమాల్లో రొమాంటిక్‌ సీన్లు చాలా కామన్‌.. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్‌లో రన్‌ అయితే పెద్ద చర్చనీయాంశం అని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్‌లో విడుదలైన 'దయావన్' సినిమా పెద్ద సన్సేషన్‌ అని చెప్పవచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు.  వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ నటించిన  'దయావన్' మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్‌ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్‌ రొమాంటిక్‌ సీన్‌ ఉండటంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురీ దీక్షిత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తుంది. ఈ క్రమంలో తనేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ, వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్‌లో పాపులర్‌ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్‌లో అలాంటి సీన్‌ రావడంతో అందరూ షాక్‌ అయ్యారు.

'దయావన్' సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం.. రొమాంటిక్‌ సీన్‌ తీస్తున్న సమయంలో వినోద్‌ ఖన్నా పరిది దాటిపోయాడట. స్క్రీప్ట్‌ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్‌ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్‌ సీన్‌ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా ఖన్నా కొరికేశాడని దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు.  ఈ సీన్‌ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్‌ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట.

సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్‌ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్‌ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ, దర్శకుడు ఫిరోజ్‌ ఖాన్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్‌, హీరో కలిసి రూ.1 కోటి అదనంగా చెల్లించారు.  ఆ సీన్‌ తర్వాత వచ్చే సాంగ్‌కు  ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా  మరో సినిమాలో వినోద్‌ ఖన్నా ఇలాంటి పనే చేశాడని చాలామంది చెబుతుంటారు.

ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితం
పేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్‌ ఖన్నా, అక్షయ్‌ ఖన్నా).. వినోద్‌ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే  ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్‌మెంట్‌’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్‌ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్‌లెట్స్‌ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్‌ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. 

అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్‌ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ ‘ఇన్సాఫ్‌’ (1987)తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న ఆయన మరణించారు.

Videos

తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోకా లేదు: జగదీష్రెడ్డి

పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన వంగా గీతా

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం

Jammu And Kashmir: పూంచ్ జిల్లాలో లోయలో పడిన బస్సు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు

Varudu Kalyani: కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది

LB Nagar: సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య క్లారిటీ..

అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు

అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా

Photos

+5

మెట్‌గాలా 2025 ఈవెంట్‌లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)

+5

'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)

+5

భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్‌.. కిక్‌ ఇచ్చే ఫోటోలు చూశారా..?

+5

గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)

+5

#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)

+5

కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)

+5

SRH vs DC Photos : ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)

+5

రోజురోజుకీ తమన్నా అందం రెట్టింపు.. చూస్తుంటేనే! (ఫొటోలు)

+5

'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)

+5

హిమాచల్ ప్రదేశ్ లో చిల్ అవుతున్న అరియానా (ఫొటోలు)