మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
స్నానం కూడా చేయలేదు.. అమ‍్మ జీవితాంతం నన్ను..: రష్మీ
Published on Mon, 05/05/2025 - 16:29
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే సుడిగాలి సుధీర్ గుర్తొస్తాడు. జబర్దస్త్ షోతో వీరి ప్రయాణం మొదలైంది. తర్వాత కలిసి చాలా షోలు చేశారు. ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్లు సెపరేట్ గా షోలు చేసుకుంటున్నారు. సరే ఈ సంగతి పక్కనబెడితే గత నెలలో రష్మీకి ఆపరేషన్ జరిగింది. భుజం నొప్పి ఎక్కువయ్యేసరికి సర్జరీ చేయించుకున్న విషయాన్ని బయటపెట్టింది.
ఏప్రిల్ 18న ఆపరేషన్ జరగ్గా.. వారం రోజులు కూడా తిరగకుండానే ఏప్రిల్ 24న బాలి ట్రిప్ వెళ్లింది. ఇంత త్వరగా ఎలా కోలుకుందా అని అనుకున్నారు. కానీ రెండు నెలల ముందే ఇదంతా ఫిక్స్ కావడంతో క్యాన్సిల్ చేయలేకపోయానని, తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసే ట్రిప్ కావడంతో తప్పక వెళ్లాల్సి వచ్చిందని రష‍్మీ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
నడిచే అవకాశం లేనప్పటికీ, వీల్ ఛైర్ లోనే తిరుగుతూ బాలి ట్రిప్ పూర్తి చేసి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ట్రిప్ కి వెళ్లడం ఏమో గానీ అమ్మ తనని జీవితాంతం దెప్పిపొడవడం గ్యారంటీ అని చెప్పుకొచ్చింది.
ట్రిప్ కి వెళ్లానన్న మాటే గానీ.. ఊయల ఊగడం, డైవింగ్ చేయడం, ఇసుకలో ఆడుకోవడం, వాటర్ రైడ్స్ చేయడం, డ్యాన్సింగ్ లాంటివి చేయలేదని.. చివరకు బీచ్ లో స్నానం కూడా చేయలేకపోయానని రష్మి చెప్పుకొచ్చింది. రిచి, నీనా, శ్రుతి అనే ముగ్గురు స్నేహితులతో కలిసి రష్మీ ఈ ట్రిప్ కి వెళ్లి వచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
Tags : 1