వారెవ్వా బుమ్రా.. ఏమైనా బాల్ వేశాడా! దెబ్బ‌కు సాల్ట్ ఫ్యూజ్‌లు ఔట్‌(వీడియో)

Published on Fri, 06/28/2024 - 01:28

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నాడు. తాజాగా ఈ మెగా టోర్నీలో భాగంగా గ‌యానా వేదిక‌గా ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైన‌ల్లో బుమ్రా క‌ళ్లు చెదిరే బంతితో మెరిశాడు. 

ఇంగ్లండ్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ ఫిల్ సాల్ట్‌ను బుమ్రా అద్భుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5 ఓవ‌ర్ వేసిన బుమ్రా బ్యాట‌ర్ల‌తో మైండ్ గేమ్స్ ఆడాడు. బుమ్రా తొలి రెండు బంతుల‌ను మొయిన్ అలీకి స్లో డెలివ‌రీల‌గా సంధించాడు. 

మొయిన్ రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని ఫుల్ పేస్‌తో బౌల్ చేశాడు. ఈ క్ర‌మంలో నాలుగో బంతి స్లో డెలివ‌రీగా వ‌స్తుంద‌ని భావించిన సాల్ట్‌కు బుమ్రా ఊహించ‌ని షాకిచ్చాడు. బుమ్రా నాలుగో డెలివ‌రీని ఫుల్ పేస్‌తో పర్ఫెక్ట్ ఆఫ్-కట్టర్‌గా బుమ్రా సంధించాడు.

దీంతో సాల్ట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి అద్బుతంగా క‌ట్ అయి లెగ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క‌సారిగా సాల్ట్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
 

Videos

రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు